బాక్సింగ్ మ్యాచ్ నేపథ్యంలో ప్రోగ్రాంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. యాంకర్ బాక్సింగ్‌లో ఎవరితో పోటీపడాలని ఆయన భావిస్తున్నారని అడిగారు. ట్రంప్ మాత్రం 'నేను ప్రపంచంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే, కేవలం ప్రొఫెషనల్ బాక్సర్‌తో మాత్రమే కాదు, జో బైడెన్‌పై కూడా తలపడతాను. బహుశా నేను బైడెన్‌పై సులువుగా పోరాడుతానని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా చాలా త్వరగా డౌన్ అవుతారని భావిస్తున్నా. ఆయన చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారు. మొదటి కొన్ని సెకండ్లలో బైడెన్ ఓడిపోతారని అనుకుంటున్నా' అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ట్రంప్, బైడెన్ మధ్య బాక్సింగ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తాము రెఢీగా ఉన్నామని పలువురు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ట్రంప్ ప్రస్తుతం బైడెన్ కు ఉన్న వ్యతిరేకతను తన వైపు లాగేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న ఘటనల కారణంగా బైడెన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. దీంతో ట్రంప్ ప్రజల్లో మరింత చొచ్చుకొని వెళ్లాలని అనుకుంటూ ఉన్నాడు.