అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సంచలన నిర్ణయాలు.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అనుచరులు చేసిన విధ్వంసం పట్ల ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది. అభిశంసన తీర్మానాన్ని రెండు సార్లు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చెడ్డపేరును కూడా మూటగట్టుకున్నాడు.
ఇక ట్రంప్ తన పదవి కాలం ముగిసే చివరి రోజున ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. ట్రంప్ తన మాజీ సలహాదారుడు స్టీవ్ బ్యానన్‌కు క్షమాభిక్ష పెట్టారు. ప్రజలను మోసం చేయడమే కాక దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను బ్యానన్ సేకరించారని, వీటిలో చాలా మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఆయన ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. లిల్ వెయిన్, కోడక్ బ్లాక్, క్విల్‌పాట్రిక్ లకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. మొత్తం 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు. ర్యాపర్ లిల్ వెయిన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్‌పాట్రిక్‌ల శిక్షలను కూడా తగ్గించారు.