ఉక్రెయిన్‌లో శాంతి కోసమే భారత్‌పై సుంకాలు.. కోర్టులో ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ వింత వాదన..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్‌లను చట్టవిరుద్ధమని ప్రకటించిన అప్పీల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

By Medi Samrat
Published on : 4 Sept 2025 6:00 PM IST

ఉక్రెయిన్‌లో శాంతి కోసమే భారత్‌పై సుంకాలు.. కోర్టులో ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ వింత వాదన..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్‌లను చట్టవిరుద్ధమని ప్రకటించిన అప్పీల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు పత్రాలలో ఉక్రెయిన్‌లో శాంతిని సాధించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలలో ఈ సుంకాలు ఒక ముఖ్యమైన అంశం అని ట్రంప్ పరిపాలన వాదించింది.

"ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి సంబంధించి ముందుగా ఉన్న జాతీయ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి రష్యా ఇంధన ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్‌పై IEEPA సుంకాలకు అధ్యక్షుడు ఇటీవలే అధికారం ఇచ్చారు" అని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ కోర్టుకు తెలిపింది. అంతేకాదు.. యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న‌ ప్రయత్నాలలో ఇది ముఖ్యమైన అంశం అని పేర్కొంది.

ఆగస్టు 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై సుంకాన్ని రెట్టింపు చేసి 50 శాతానికి పెంచింది. సుంకాలతోనే అమెరికా ధనిక దేశమని.. అవి లేనిచో పేద దేశమని పేర్కొంది.

ప్రెసిడెంట్ ప్రకారం.. ఒక సంవత్సరం క్రితం యునైటెడ్ స్టేట్స్ చనిపోయిన దేశం, మరి ఇప్పుడు అమెరికా మళ్లీ బలమైన, ఆర్థికంగా లాభదాయకమైన, గౌరవప్రదమైన దేశంగా మారింది.. ఎందుకంటే మనతో ఘోరంగా ప్రవర్తించిన దేశాల నుండి ట్రిలియన్ల డాలర్ల చెల్లింపులు జరిగాయి.

గత వారం US అప్పీల్ కోర్టు ట్రంప్ విధించిన అనేక సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యంపై సుంకాలు ప్రభావం చూపాయని కోర్టు పేర్కొంది. అత్యధిక సుంకాలను విధించేందుకు అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాన్ని అధిగమించారని దిగువ కోర్టు కనుగొన్నట్లు ఈ తీర్పు ధృవీకరించింది.

ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మా సుంకాలను తొలగించాలని అప్పీల్ కోర్టు చెప్పడం తప్పు అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసారు, అయితే అంతిమంగా యునైటెడ్ స్టేట్స్ గెలుస్తుందని వారికి తెలుసు. సుప్రీంకోర్టు సాయంతో కూడా వ్యతిరేకిస్తామన్నారు.

Next Story