ఒప్పందానికి అంగీకరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇదే నా చివరి హెచ్చరిక..!
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
By Medi Samrat
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గాజాలో పట్టుబడిన బందీలను విడిపించే ఒప్పందాన్ని అంగీకరించడానికి హమాస్‌కు చివరి అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్‌ను పంచుకున్న ట్రంప్.. "ఇజ్రాయెల్ చాలా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ వంతు" అని అన్నారు. హమాస్ ఒప్పందానికి అంగీకరించకపోతే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే నా చివరి హెచ్చరిక. దీని తర్వాత ఇక మీకు అవకాశం రాదు అని హెచ్చరించారు.
ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. గాజాపై త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు. "మేము త్వరలో గాజాపై ఒప్పందం చేసుకుంటామని నేను భావిస్తున్నాను. ఇది అన్ని సమస్యలకు మూలం. బందీలను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలోని సమస్యలు ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ పరిష్కారం కావాలన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరిగి 23 నెలలు అవుతోంది. హమాస్ ఇప్పటికీ 20 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా ఉంచింది. వారు 20 మందిని పట్టుకున్నారు.. బందీలలో ఎక్కువ మంది యువకులే అయినప్పటికీ, చాలా మంది బందీలు మరణించారు. హమాస్‌లో దాదాపు 20 బందీలు, 38 మృతదేహాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ప్రకారం.. హమాస్ బందీలను విడిచిపెట్టి, ఆయుధాలను విడిచే వరకు గాజాలో యుద్ధం ముగియదన్నారు.