ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశం ఇదే.. ప్రభుత్వాన్ని ప్రజలు చేజిక్కించుకుంటారా.?

ఇరాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయని, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 5:30 PM IST

ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశం ఇదే.. ప్రభుత్వాన్ని ప్రజలు చేజిక్కించుకుంటారా.?

ఇరాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయని, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆయన 8 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్ భద్రతా దళాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే, ప్రజలకు కీలక సూచనలు చేశారు.

ఇరాన్ ప్రజలారా, మీ స్వేచ్ఛకు సమయం ఆసన్నమైంది. బయట చాలా ప్రమాదకరంగా ఉంది, బాంబులు అన్నిచోట్లా పడతాయి. మేము దాడులు పూర్తి చేశాక, మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి. అది మీ సొంతం అవుతుందని అన్నారు ట్రంప్. చాలా ఏళ్లుగా ఇరాన్‌లోని కొన్ని వర్గాలు అమెరికా సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని, కానీ అది ఎప్పుడూ అందలేదని ట్రంప్ గుర్తుచేశారు. ఇప్పుడు మేం మీకు అండగా నిలుస్తున్నాం. మా అపారమైన, విధ్వంసకర బలంతో మీకు మద్దతిస్తున్నాం. దీనిపై మీరు ఎలా స్పందిస్తారో చూస్తాంమని ఆయన అన్నారు.

Next Story