భర్తతో సెక్స్ చేయడానికి నిరాకరించిన "స్త్రీ"ని దోషిగా పరిగణించకూడదు
శృంగారం చేయనన్న భార్యతో విడాకులు తీసుకున్నాడు ఓ భర్త.
By Medi Samrat Published on 23 Jan 2025 9:17 PM ISTశృంగారం చేయనన్న భార్యతో విడాకులు తీసుకున్నాడు ఓ భర్త. అయితే ఈ విషయంలో ఆమెకు అన్యాయం జరిగిందని యూరప్ లోని అత్యున్నత హక్కుల న్యాయస్థానం 69 ఏళ్ల ఫ్రెంచ్ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) ఆమెకు జరిగిన అన్యాయంపై స్పందించింది. విడాకుల సందర్భంలో కోర్టులు తన భర్తతో సెక్స్ చేయడానికి నిరాకరించిన స్త్రీని "తప్పు"గా పరిగణించకూడదని కూడా ECHR తెలిపింది. ప్రైవేట్, కుటుంబ జీవితాన్ని గౌరవించే హక్కుకు సంబంధించిన మానవ హక్కులపై యూరోపియన్ కన్వెన్షన్ ఆర్టికల్ 8ని ఫ్రాన్స్ ఉల్లంఘించిందని స్ట్రాస్‌బర్గ్ ఆధారిత కోర్టు తెలిపింది. వైవాహిక విధులకు సంబంధించిన ఏదైనా భావన లైంగిక సంబంధాలకు ప్రాతిపదికగా సమ్మతి ఉంటేనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఇందులో ఆమె తప్పు ఉండదని తెలిపింది.
కోర్టు ఆమెను కేవలం హౌస్ వైఫ్ గా గుర్తించింది. ఆమె పారిస్ పశ్చిమ శివారులోని లే చెస్నేలో నివసిస్తుంది. సదరు స్త్రీ ఆమె భర్త 1984లో వివాహం చేసుకున్నారు. నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక దివ్యంగురాలైన కుమార్తె కూడా ఉంది. ఆమెకు తల్లిదండ్రుల స్థిరమైన ఉనికి అవసరం, తల్లి ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉండేది. మొదటి బిడ్డ పుట్టగానే భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఆ మహిళ 1992లో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది. 2002లో ఆమె భర్త ఆమెను శారీరకంగా, మాటలతో వేధించడం ప్రారంభించాడని కోర్టు పేర్కొంది. 2004లో, ఆమె అతనితో సెక్స్ చేయడం మానేసి, 2012లో విడాకుల కోసం పిటిషన్ వేసింది. 2019లో, వెర్సైల్లెస్‌లోని అప్పీల్ కోర్టు మహిళ ఫిర్యాదులను తోసిపుచ్చింది. ఆమె భర్త పక్షాన నిలిచింది, అయితే కోర్ట్ ఆఫ్ కాసేషన్ నిర్దిష్ట కారణాలు చూపకుండా అప్పీల్‌ను కొట్టివేసింది. ఆమె చివరికి ECHRని ఆశ్రయించింది.
ఆమె కేసుకు రెండు హక్కుల సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఫోండేషన్ డెస్ ఫెమ్మెస్ (మహిళల ఫౌండేషన్), కలెక్టిఫ్ ఫెమినిస్ట్ కాంట్రే లె వయోల్ (రేప్ వ్యతిరేకంగా స్త్రీవాద కలెక్టివ్) మద్దతు ఇచ్చాయి. మహిళలను కేవలం శృంగారానికే పరిమితం చేయడం తప్పని పలువురు ఆమెకు మద్దతుగా వాదించారు. ఈ విడాకుల విషయంలో మహిళను తప్పు పట్టడం కరెక్ట్ కాదంటూ తేల్చారు.