టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇది టెలికాం పరిశ్రమలో అతిపెద్ద తొలగింపులలో ఒకటిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోమవారం.. కంపెనీ స్వీడన్‌లో సుమారు 1,400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ.. టెలికాం పరిశ్రమలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద తొలగింపుగా పేర్కొంటున్నారు.
"చాలా దేశాలలో ఈ వారంలో ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే తెలియజేయబడిందని" అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోల్మ్ పేర్కొన్నాడు. ఎరిక్సన్ ఏ దేశంలో ఎక్కువగా ప్రభావితమవుతుందో వెల్లడించలేదు. విశ్లేషకులు ఉత్తర అమెరికాలో ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంటున్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు తక్కువగా ఉంటాయని అంచనా వేశారు.