ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న యూరోపియన్ దేశమైన అండోరాలో ఎంతో ప్రశాంతంగా గడపొచ్చట. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం.. 2025లో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా అండోరా గుర్తింపు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్, ఒమన్‌తో సహా మూడు మధ్యప్రాచ్య దేశాలు ప్రపంచంలోని అత్యల్ప నేరాల రేటు కలిగిన మొదటి ఐదు దేశాలలో ఉన్నాయి. ఈ దేశాల్లో అత్యంత బలమైన భద్రతా మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఇండెక్స్ డేటా వెల్లడించింది.
ఈ డేటా ప్రకారం భారతదేశం మాత్రం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి మొదటి ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా ఉంది, వీటిని సాంప్రదాయకంగా స్థిరమైన, సురక్షితమైన దేశాలుగా చూస్తారు. అమోన్ 147వ స్థానంలో, భారతదేశం 66వ స్థానంలో (స్కోరు: 55.7), యుకె 87వ స్థానంలో (స్కోరు: 51.7), యుఎస్ 89వ స్థానంలో (స్కోరు: 50.8) ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో, చైనా (స్కోరు: 76.0) 15వ స్థానంలో, శ్రీలంక (స్కోరు: 57.9) 59వ స్థానంలో, పాకిస్తాన్ (స్కోరు: 56.3) 65వ స్థానంలో, బంగ్లాదేశ్ (స్కోరు: 38.4) 126వ స్థానంలో నిలిచాయి.