తాలిబాన్ల చేతుల్లోకి అమెరికా ఆయుధాలు
The Taliban have access to US military aircraft. Now what happens. తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే..! అయితే
By Medi Samrat Published on 20 Aug 2021 9:59 AM GMTతాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే..! అయితే అత్యాధునిక ఆయుధాలు కూడా తాలిబాన్ల చేతుల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. తాలిబాన్ల చేతుల్లోకి అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన ఆయుధాలు వెళ్లాయి. తాలిబాన్లు అమెరికాలో తయారైన అధునాతన యుద్ధ విమానాలు, తుపాకులు, నైట్ విజన్ గాగుల్స్, రాకెట్లు, డ్రోన్లను అఫ్ఘాన్ భద్రతా దళాల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
యూఎస్ హమ్ వీస్ తో సహా 2వేల కంటే ఎక్కువ సాయుధ వాహనాలు, 40 విమానాలు తాలిబాన్ల వశమయ్యాయని ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. నెల క్రితం ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ యునైటెడ్ స్టేట్స్ కాబూల్‌కు పంపించిన ఏడు సరికొత్త హెలికాప్టర్‌ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ దళాల నుంచి అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ దేశాల్లో కూడా కలవరం మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఆర్మీకి అమెరికా పంపించిన సైనిక వాహనాలు తాలిబాన్ల చేతుల్లోకి వచ్చాయి. ఖాళీ చేయిస్తున్న సమయంలో తాలిబాన్లు వ్యతిరేకించే అవకాశముందని అమెరికా ఆందోళన చెందుతోంది.
అమెరికా తయారు చేసిన ఆయుధాలను తాలిబాన్ పోరాట యోధులు స్వాధీనం చేసుకోవడం తమ మిత్ర దేశాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని యూఎస్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. 2002 నుంచి 2017 సంవత్సరాల మధ్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ఘన్ సైన్యానికి సుమారు 28 బిలియన్ ఆయుధాలను ఇచ్చింది. ఇందులో తుపాకులు, రాకెట్లు, నైట్ విజన్ గాగుల్స్, చిన్న డ్రోన్‌లు కూడా ఉన్నాయి. వీటితో తీవ్రవాదులు ఏమి చేస్తారోనని భయపడుతూ ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశానికి పంపకుండా పెండింగ్ లో ఉన్న, ఇంకా పంపిణీ చేయని ఆయుధాల బదిలీపై సైతం సమీక్షించనున్నారు. ఈ మేరకు అమెరికా రాజకీయ/మిలటరీ వ్యవహారాల బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్గాన్ లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం తదితర అంశాల ఆధారంగా పెండింగ్ లో ఉన్న, ఎగుమతి చేసిన ఆయుధాల లైసెన్స్ ల ఆమోదాన్ని డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్ సమీక్షిస్తుందని ప్రకటనలో తెలిపారు.