బ్యాంకుపై కోపంతో మిలీయనీర్ ఏం చేశాడంటే..!
The little millionaire withdraws 5cr. కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇలాంటి తరుణంలో మాస్కులు ధరించడం,
By అంజి Published on 23 Oct 2021 6:12 PM IST
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇలాంటి తరుణంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ప్రజా జీవన విధానంలో భాగమైంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలంటూ ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అయితే అవేమి తనకు పట్టనట్లుగా వ్యవహరించాడు చైనాకు చెందిన ఓ మిలీయనీర్. బ్యాంక్ ఆఫ్ షాంఘైలోకి మాస్కు పెట్టుకోకుండా మిలీయనీర్ ఎంట్రీ ఇస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మాస్కు పెట్టుకుంటేనే లోపలికి అనుమతిస్తామన్నారు. దీంతో బ్యాంక్‌పై కోపం తెచ్చుకున్న మిలీయనీర్.. తన బ్యాంక్ అకౌంట్‌లో నగదును విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
చైనాలోని బ్యాంకుల్లో ఒకరోజుకు 50 లక్షల యువాన్‌లు (మన లెక్కల్లో రూ.5.8 కోట్లు) మాత్రమే విత్ డ్రాకు అనుమతి ఉంది. దీంతో 50 లక్షల యువాన్‌లను మిలీయనీర్ విత్ డ్రా చేశాడు. బ్యాంకు సిబ్బంది డబ్బును చేతితో లెక్కపెట్టి ఇవ్వాలన్నాడు దీంతో ఇద్దరు బ్యాంక్ అధికారులు రెండు గంటల పాటు రూ.5 కోట్లను లెక్కించారు. తన అకౌంట్‌లో మొత్తం నగదును విత్ డ్రా చేసే వరకూ ప్రతి రోజు ఇలాగే చేస్తానన్నాడు. బ్యాంకు సిబ్బంది ప్రవర్తన సరిగాలేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిలీయనీర్ చెప్పాడు. ఈ ఘటనపై స్పందించిన బ్యాంకు యాజమాన్యం. తమ సిబ్బంది ఎవరూ కూడా అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపింది. సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే మాస్కు వేసుకోవాలని చెప్పారంది.