మ్యూజిక్‌ కోసం... అబ్బాయిగా మారిన 13 ఏళ్ల ఆమ్మాయి.. కానీ

The girl who turned into a boy for music‌.ఆమెకు మ్యూజిక్‌ అంటే ప్రాణం. మ్యూజిక్‌ బ్యాండ్‌ నేర్చుకోవడం కోసం అబ్బాయిగా మారింది. ఆ తర్వాత తన గాత్రంతో

By అంజి  Published on  16 Oct 2021 7:56 AM GMT
మ్యూజిక్‌ కోసం... అబ్బాయిగా మారిన 13 ఏళ్ల ఆమ్మాయి.. కానీ

ఆమెకు మ్యూజిక్‌ అంటే ప్రాణం. మ్యూజిక్‌ బ్యాండ్‌ నేర్చుకోవడం కోసం అబ్బాయిగా మారింది. ఆ తర్వాత తన గాత్రంతో అందరినీ ఫిదా చేసింది. ఆమె పాటల వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో అసలు విషయం బయటపడింది. చైనాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయి ఫు జియాన్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. మ్యూజిక్‌ నేర్చుకోవడం కోసం చైనాలోని టాప్‌ మ్యూజిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో ఒకటైన మ్యూజిక్ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, వైజీఎన్‌ యూత్‌ క్లబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంది. అయితే ఆ మ్యూజిక్‌ సెంటర్‌లో కేవలం అబ్బాయిలకు మాత్రమే మ్యూజిక్‌ నేర్పిస్తారు.

మ్యూజిక్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ పొందాలంటే ముందు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే గత కొంత కాలంగా కరోనా ఎఫెక్ట్‌తో పరీక్షలను, అడ్మిషన్లను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా భావించిన ఫు జియాన్‌.. ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష రాసి నెగ్గింది. తాను అబ్బాయిగా చెప్పుకొని మ్యూజిక్‌ సెంటర్‌లో అడుగుపెట్టింది. ట్రైనింగ్‌ తర్వాత ఫు జియాన్‌ పాడిన పలు పాటలు రిలీజ్ అయ్యాయి. ఆమె గొంతు నుండి వచ్చిన పాటలకు అందరూ ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియాలో ఆమె వీడియోలు వైరల్‌గా మారాయి.

దీంతో ఫు జియాన్‌ అబ్బాయి కాదని.. అమ్మాయి అని తెలిసిన కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఆ నోటా ఈ నోటా విషయం కాస్తా మ్యూజిక్‌ సెంటర్‌ ప్రతినిధులకు చేరింది. దీంతో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఆమె ఆడిన ఒక్క అబద్దంతో జీవితం తలక్రిందులుగా మారింది. ఈ విషయాన్ని వైజీఎన్‌ యూత్‌ క్లబ్‌ సీరియస్‌గా తీసుకుని ఆమె చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా తన చేసిన తప్పుకు ఫుజియాన్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పింది. మ్యూజిక్‌ను శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోని కానీ, వీడియో ఫ్లాట్‌ఫామ్‌లలో గాని కనిపించనని తెలిపింది.

Next Story