నా కారు మద్యం తాగి నడుస్తోందంటున్న బ్రిటన్ యువరాజు..!

The car of the Prince of Britain running with wine. సాధారణంగా కార్లు డీజిల్‌, పెట్రల్‌తో నడుస్తుంటాయి. పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడిప్పుడే

By అంజి  Published on  14 Oct 2021 6:12 AM GMT
నా కారు మద్యం తాగి నడుస్తోందంటున్న బ్రిటన్ యువరాజు..!

సాధారణంగా కార్లు డీజిల్‌, పెట్రల్‌తో నడుస్తుంటాయి. పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. అయితే అదంతా కాదు.. నా కారు మాత్రం మద్యం నడుస్తోందని ప్రకటించాడు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ (72) . మనం మద్యం తాగి కారు నడిపితే నేరం.. కానీ కారు మద్యం తాగి నడిస్తే మాత్రం వినడానికే వింతగా ఉంది. తన కారు ఆస్టోన్‌ మార్టిన్‌లో వైన్‌ను పోస్తే నడుస్తోందని ప్రిన్స్ ఛార్లెస్‌ అన్నాడు. తన మహాల్‌ ఉన్న పాత కారులో వైన్‌ను పోసి ప్రిన్స్ ఛార్లెస్ అలా లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఆస్టోన్‌ మార్టిన్ కారు అంటే ఎంతో ఇష్టం. తన 21 ఏళ్ల వయసులో ఆ కారును అతడు బహుమతిగా అందుకున్నాడు. ఆ తర్వాత దానిని తన అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకున్నాడు.

ఇంజినీర్లు ఎంతగానో శ్రమించి... ఈ కారును వైన్‌తో నడిచేలా రీడిజైన్‌ చేశారు. అప్పుడప్పుడు జున్ను తయారీ చేసే సమయంలో విరిగిన పాలను కూడా ఇంధన వాడుతున్నామని ప్రిన్స్‌ ఛార్లెస్ తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తన వంతు కృషిగా పెట్రోల్, డీజిల్‌కు బదులుగా వైన్‌ను ఉపయోగిస్తున్నాని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ తెలిపాడు. ఈ నెల 31వ తేదీన వాతావరణ మార్పులపై యూఎన్‌ఓలో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ... భూమిని రక్షించేందుకు యూఎన్‌వో జీవవైవిధ్య సదస్సులో ప్రపంచ దేశాలు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story