ఏంటి మస్క్ అలా అనేశాడు..!
Tesla, Starlink in India Elon Musk was asked on Twitter. భారత్ లో టెస్లా కార్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 28 May 2022 10:20 AM GMTభారత్ లో టెస్లా కార్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వమేమో చైనాలో తయారు చేసిన వాహనాలను ఇక్కడ అమ్మకండని.. ఇక్కడ తయారు చేసిన వాటినే భారతీయులకు అమ్మాలని కోరుతోంది. టెస్లా కార్ల తయారీ ప్లాంట్ భారత్ లో ఎక్కడ పెడతారో అనే విషయంపై ఓ వైపు చర్చ జరుగుతూ ఉండగా.. తయారీ ప్లాంట్ పెట్టడంపై ఆ సంస్థ అధిపతి, సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట కార్లను దిగుమతి చేసి అమ్మడం, సర్వీసుకు అనుమతించే వరకు ప్లాంట్ ను పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దక్షిణ భారత దేశంలో టెస్లా ప్లాంట్ పెడుతోందంటూ కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ట్విట్టర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. ''ముందుగా మా కార్లను అమ్ముకుని, సర్వీస్ చేసుకునేంత వరకు భారత్ లోని ఏ ప్రాంతంలోనూ మేం కార్ల ఉత్పత్తి ప్లాంట్లను పెట్టడం లేదు'' అని మస్క్ చెప్పుకొచ్చాడు.
భారత్ లో ప్లాంట్ పెట్టి తయారు చేసి కార్లు అమ్మాలని, ఆ తర్వాత దిగుమతి చేసుకుని అమ్మేందుకు అవకాశమిస్తామని కేంద్రం చెబుతుండగా.. మస్క్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ముందుగా కార్లను దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతున్నాడు మస్క్. భారతదేశంలో మార్కెట్ ను బట్టి ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.