జమ్మూకశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ఎన్నో సార్లు తన బుద్ధిని బయట పెట్టగా.. ప్రస్తుతం తాలిబన్లను ఉపయోగించుకుని తాము కశ్మీర్ ను సొంతం చేసుకుంటామని పాక్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ చానెల్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుతం తాము తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నామని.. త్వరలో తాలిబాన్లు కశ్మీర్ విషయంలో తమకు సహాయం చేస్తారని పాక్ లో అధికారంలో ఉన్న పీటీఐ నేత నీలం ఇర్షాద్ షేక్ చెప్పుకొచ్చారు. కశ్మీర్ విషయంలో మనకు సాయం చేసేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నారు' అని ఆమె అన్నారు.
యాంకర్ ఆశ్చర్యపోతూ 'మేడమ్, మీరేమంటున్నారో మీకన్నా అర్థమవుతోందా? మీకర్థం కావడంలేదు. ఈ షో ప్రపంచం మొత్తం ప్రసారమవుతుంది. ఇండియాలో కూడా ఇది చూస్తారు.. మీకు తాలిబాన్లు సందేశం పంపారా మేము కశ్మీర్ విషయంలో సహాయం చేస్తామని.. ఇంతకూ ఎలా చెప్పగలుగుతున్నారు' అని యాంకర్ ప్రశ్నించారు. 'తాలిబాన్లు అవమానకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నారని, అందుకే తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు.. తాలిబాన్లు తమతోనే ఉన్నారని.. కశ్మీర్ ను తమకు ఇప్పిస్తారని.. పాకిస్తాన్ తాలిబాన్లకు ఎంతగానో సహాయం చేసింది కాబట్టి.. కశ్మీర్ విషయంలో వాళ్లు కూడా తమకు సహాయం చేస్తారు' ఆమె తెలిపింది. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబాన్లు ప్రకటించారని నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి.