యువతిని కిరాతకంగా చంపేసిన తాలిబాన్లు.. కారణం ఏమిటంటే
Taliban kills woman for wearing tight clothes in Afghanistan's Balkh province. అమెరికా సైన్యం అధికారికంగా నిష్క్రమించడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో
By Medi Samrat Published on 9 Aug 2021 10:15 AM GMT
అమెరికా సైన్యం అధికారికంగా నిష్క్రమించడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు చాలా భూభాగాలను ఆక్రమించింది. ఆదివారం, తాలిబాన్లు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ రాజధానిలోని కొన్ని భాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ అమ్మాయి శరీరానికి అతుక్కుని వుండే దుస్తులు ధరించిందన్న ఆరోపణతో ఆమెను తాలిబన్లు అత్యంత దారుణంగా చంపారు. నజానిన్ అనే 21 సంవత్సరాల యువతి బయటకు వెళ్తుండగా తాలిబన్లు చంపేశారని పోలీసులు గుర్తించారు. మహిళలు ఎవరూ ఉద్యోగాలు చేయకూడదని, పని కోసం బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే బయట కనపడుతోన్న మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్‌లో శరీరానికి అతుక్కుపోయిన బట్టలు ధరించినందుకు, మగ తోడు లేకుండా బయటకు వచ్చినందుకు యువతిని తాలిబాన్లు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాలిబాన్ నియంత్రణలో ఉన్న సమర్ ఖండ్ గ్రామంలో మహిళను కాల్చి చంపారని ఆఫ్ఘనిస్తాన్‌లో రేడియో ఆజాది నివేదిక పేర్కొంది. నజానిన్ తన ఇంటి నుండి వెళ్లి మజార్-ఇ-షరీఫ్ కోసం వాహనం ఎక్కబోతుండగా ఆమెపై దాడి జరిగింది. నజావిన్‌ను తాము చంపలేదని, పోలీసులు తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తాలిబన్లు అంటున్నారు.