కొత్త ప్రభుత్వం.. ఆప్ఘాన్ ఇక.. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘానిస్తాన్

Taliban declare Afghanistan 'Islamic emirate', announce new goment. ఆప్ఘానిస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడినట్లుగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్

By Medi Samrat  Published on  8 Sep 2021 9:04 AM GMT
కొత్త ప్రభుత్వం.. ఆప్ఘాన్ ఇక.. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘానిస్తాన్

ఆప్ఘానిస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడినట్లుగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ తెలిపారు. మధ్యంతరంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి అధిపతిగా తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ఉండనున్నట్లు జుబీహుల్లా చెప్పారు. అలాగే సహాయ అధిపతిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరించనున్నారు. 20 ఏళ్ల యుద్ధం ముసిగిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఆప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆప్థాన్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ యూఎన్‌ఓ బ్లాక్‌ లిస్టులో ఉన్నారు. 'మా దేశ పౌరులు నూతన ప్రభుత్వం కోసం వేచిచూస్తున్నారని మాకు తెలుసు' అంటూ జుబీహుల్లా ముజాహిద్ అన్నారు.

తాలిబన్ మధ్యంతరంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో మంత్రి వర్గం కీలకమైనది. రక్షణమంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీగా ముల్లా అబ్దుల్ సలామ్ హనాఫీ, విదేశాంగ శాఖ మంత్రిగా అమీర్ ఖాన్ నియమించబడ్డారు. తాలిబన్ల అనుబంధ సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీ ఆప్ఘాన్ హోంమంత్రిగా నియమించబడ్డాడు. అయితే సిరాజుద్దీన్ హక్కానీ పేరు అమెరికా ఇన్వేస్టిగేషన్ సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా దేశం టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా చూస్తోంది. మంత్రివర్గంలో మహిళలు ఎవరు లేరా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు.. తాలిబన్ అధికారి అహ్మదుల్లా వసీక్ సమాధానమిస్తూ.. ఇది పూర్తి స్థాయి మంత్రి వర్గం కాదని చెప్పారు. అలాగే ఇక నుండి ఆప్ఘాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘానిస్తాన్ అవుతుందన్నారుNext Story