హిట్లర్ ను తప్పించుకున్నాడు.. పుతిన్ చేతిలో బలయ్యాడు
Survived Hitler, murdered by Putin. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల దండయాత్ర నుండి బయటపడిన 'బోరిస్ రోమన్‌చెంకో' అనే వ్యక్తి
By Medi Samrat Published on 22 March 2022 3:57 PM ISTరెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల దండయాత్ర నుండి బయటపడిన 'బోరిస్ రోమన్‌చెంకో' అనే వ్యక్తి తాజాగా రష్యన్ దళాల చేతిలో హతమయ్యాడు. గత వారం ఖార్కివ్‌లోని అతని ఫ్లాట్‌పై రష్యా దాడి చేయడంతో మరణించినట్లు తెలిపారు. అప్పట్లో హిట్లర్ దాడి సమయంలో 'బుచెన్‌వాల్డ్' గురించి చెప్పుకునే వారు. హిట్లర్ బృందం బుచెన్‌వాల్డ్ లో ఎన్నో దారుణాలకు తెగబడింది. అప్పట్లో ప్రాణాలతో బయటపడిన వారిలో బోరిస్ కూడా ఒకరు. ఇప్పుడు పుతిన్ దాడిలో బోరిన్ ప్రాణాలు కోల్పోయాడు.
96 ఏళ్ల బోరిస్ అదే యుద్ధంలో డోరా-మిట్టెల్‌బావు కాన్సంట్రేషన్ క్యాంప్, బెర్గెన్-బెల్సెన్ శిబిరం నుండి కూడా బయటపడ్డాడు. "ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధంలో బోరిస్ రోమన్‌చెంకో మరణాన్ని మేము నివేదించడం బాధాకరంగా ఉంది" అని బుచెన్‌వాల్డ్ సర్వైవర్స్ మెమోరియల్ ఒక ప్రకటనలో తెలిపింది. "రోమన్‌చెంకో నివసించిన బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనంపై దాడి జరగడమే కాకుండా.. మంటల్లో చిక్కుకుంది" అని ప్రకటన చేశారు. "బోరిస్ రోమన్‌చెంకో భయంకరమైన మరణం ఉక్రెయిన్‌లో కాన్సంట్రేషన్ క్యాంపు ప్రాణాలకు ఎంత ముప్పు కలిగిస్తుందో చూపిస్తుంది" అని ప్రకటన ద్వారా పేర్కొంది.
Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9
— Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022
ఈ వార్తలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను విమర్శించారు. "ఇది ఎంతో పెద్దనేరం. హిట్లర్ సమయంలో ప్రాణాలతో బయటపడ్డా, పుతిన్ హత్య చేశారు" అని కులేబా ట్వీట్ చేశారు. "హిట్లర్ కూడా చేయలేనిది పుతిన్ సాధించగలిగాడు" అని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్ రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ రష్యన్ సైన్యం దెబ్బకు శిథిలమైంది.
బుచెన్‌వాల్డ్ మెమోరియల్ నుండి వచ్చిన ప్రకటన ప్రకారం రోమన్‌చెంకో జనవరి 20, 1926 న సుమీ నగరానికి సమీపంలోని బొండారిలో జన్మించాడు. అతను 1942లో డార్ట్‌మండ్‌కు వెళ్ళాడు, అక్కడ అతను బలవంతంగా మైనింగ్ పనులు చేయవలసి వచ్చింది. తప్పించుకునే ప్రయత్నం తరువాత, అతను 1943లో బుచెన్‌వాల్డ్ నిర్బంధ శిబిరానికి పంపబడ్డాడు, రెండవ ప్రపంచ యుద్ధంలో 53,000 మందికి పైగా మరణించారు.