పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఇమామ్‌బర్గాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. రాజధానిలోని షాజాద్ టౌన్ ప్రాంతంలోని తర్లై ఇమాంబారాలో ఈ భారీ పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు క్యాపిటల్ పాలీక్లినిక్, పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS), CDA హాస్పిటల్‌లలో వైద్య సేవలు అందిస్తున్నారు.
షియా మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు, రెస్క్యూ 1122 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. పిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూచనల మేరకు ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని ఒక ప్రతినిధి డాన్‌తో అన్నారు.
ఇదిలావుంటే.. నవంబర్ 11, 2025న ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మూడు నెలల్లోపు ఇస్లామాబాద్‌లో మరో బాంబు దాడి జరిగింది, ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు సమాచారం.