గత మార్చిలో 'ఎవర్ గివెన్' కంటైనర్ నౌక ఇచ్చిన ఎఫెక్ట్ తో ఈజిప్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయజ్ కాలువ లోతు, వెడల్పు లు పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇస్మాయిలియా నగరంలో జరిగిన సమావేశంలో సూయిజ్ కాలువ పర్యవేక్షణ అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ వెల్లడించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతే అల్-సీసీ, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కాలువ దక్షిణ భాగంలో 30 కిలోమీటర్ల మేర అంటే దాదాపు 40 మీటర్లు, అడుగులలో చెప్పాలి అంటే 131 అడుగుల వెడల్పును, అలాగే కాలువ ప్రస్తుత ఉన్న లోతు 66 అడుగులు కాగా దానిని ఇప్పుడు 72 అడుగుల వరకు పెంచనున్నట్టు ప్రకటించారు.
అయితే ఇదంతా అనుకున్నంత ఈజీగా జరిగిపోదు.. దాదాపు 2 సంవత్సరాలు పడుతుందని అంచనా. వారం రోజుల పాటూ ఈజిప్ట్ వద్ద సూయజ్ కాలువలో ఇరుక్కుపోయి అంతర్జాతీయ నౌక ఎవ్వర్ గ్రీన్ ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కానొక సమయంలో సుమారు 400 పైగా నౌకలు ఎవ్వర్ గ్రీన్ కు ఇరుపక్కలా నిలిచిపోయాయి. చివరికి నౌక కదిలినప్పటికీ తనకు భారీ నష్టాన్ని కలిగించింది అంటూ ఈజిప్ట్ ప్రభుత్వం నౌకని అదుపులోకి తీసుకుంది. రాకాసి ఓడపై సుమారు 900 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. అయితే ఎవ్వర్ గ్రీన్ యాజమాన్యం అది చెల్లించడానికి సుఖంగా లేకపోవడంతో నౌక ఇప్పటికీ ఈజీప్ట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నట్టు సమాచారం.