పాపులర్ పజిల్ గేమ్ సుడోకు సృష్టికర్త మాకి కాజి ఆనారోగ్యంతో కన్నుమూశారు. 69 ఏళ్ల మాకి కాజి.. బైల్ డక్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన తుది ప్రాణాలు విడిచారు. కాజికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం నిఖోలిని కంపెనీనికి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. నిఖోలి కంపెనీ సిబ్బంది కోసం నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యుల మధ్యే కాజి అంత్యక్రియలను పూర్తి చేశారు.
మాకి కాజిని గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్నపిల్లల కోసం నెంబర్స్‌తో పజిల్‌ను తయారు చేశారాయన. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నెంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్‌కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 సంవత్సరంలో సుడోకో గేమ్ సూపర్‌హిట్ అయ్యింది. తన పజిల్స్ గురించి ప్రచారం చేసేందుకు కాజి సుమారు 30 దేశాల్లో పర్యటించారు. వంద దేశాల్లో 20 కోట్ల మంది సుడోకో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.