ఆ దేశంలో ఆహార సంక్షోభం..!

Sri Lanka declares food emergency as forex crisis worsens. ఓ వైపు ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నెమ్మదిస్తున్న తరుణంలో.. శ్రీలంక దేశంలో

By అంజి  Published on  1 Sept 2021 8:52 AM IST
ఆ దేశంలో ఆహార సంక్షోభం..!

ఓ వైపు ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నెమ్మదిస్తున్న తరుణంలో.. శ్రీలంక దేశంలో ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆహార సంక్షోభాన్ని ప్రకటించినట్టు ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తెలిపాడు. దీంతో చక్కెర, ఆలూ, ఉల్లిగడ్డ, బియ్యం, ఇతర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంటగ్యాస్, కిరోసిన్, పాలు, సూపర్ మార్కెట్లు, కిరాణ షాపులు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అక్రమంగా నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకుంటున్న వారి పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోంది. నిత్యావసర వస్తువులను ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటున్న వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అయితే సరుకుల సప్లైని సమన్వయం చేసేందుకు ఓ సైన్యానికి చెందిన ఉన్నతాధికారిని నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మరో వైపు దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో విదేశాల నుండి సరుకులను దిగుమతి చేసుకోవడం అక్కడి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. శ్రీలంకలో 2 కోట్ల 10 లక్షల మంది జనాభా ఉన్నారు. కోవిడ్‌ విజృంభణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో శ్రీలంకలో ఫైనాన్షియల క్రైసిస్ ఏర్పడింది. ఈ దెబ్బతో స్థానిక బ్యాంకుల్లోని విదేశీ మారక నిల్వలు భారీగా తరిగిపోయాయి. 2019 సంవత్సరంలో 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం.. 2021 జులై నాటికి 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లుగా శ్రీలంకకు చెందిన ఓ ప్రముఖ బ్యాంక్ తెలిపింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే శ్రీలంకన్ రూపీ విలువ 20 శాతానికి దిగజారింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు పలు నిత్యావసర వస్తువుల దిగుమతులను ఆపిన ఫలితం లేకుండా పోయింది. మెడిసన్స్, వ్యాక్సిన్‌లో కొనుగోలుకు డబ్బులు వినియోగించుకునేందుకు వీలుగా పెట్రో,డీజిల్‌ పొదుపు పాటించాలని ఆ దేశ మంత్రి ఒకరు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.


Next Story