ఆ పాప్ గాయనికి జైలు శిక్ష..!
Spanish prosecutor asks for eight-year jail term for Shakira. పాప్ గాయని షకీరా ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే
By Medi Samrat Published on 29 July 2022 8:15 PM ISTపాప్ గాయని షకీరా ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆదాయపన్నుకు సంబంధించి షకీరా మోసాలకు పాల్పడినట్టు స్పెయిన్ లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. షకీరాకు ఎనిమిదేళ్లకు పైగా జైలుశిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. షకీరా 2012-14 మధ్యకాలంలో రూ.116 కోట్ల మేర స్పెయిన్ ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. తదుపరి విచారణలో షకీరా కేసులో తుదితీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొలంబియాకు చెందిన షకీరా, స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పిక్ తో సహజీవనం చేసింది. 12 ఏళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె న్యాయవాదులు మాత్రం షకీరా నిర్దోషి అని అంటున్నారు. ఇంకా అధికారిక రిఫెరల్ ఇంకా ప్రకటించబడలేదు, విచారణ తేదీని కూడా నిర్ణయించలేదు. ప్రపంచ సంగీత పరిశ్రమలో అతిపెద్ద స్టార్స్ లో ఒకరైన షకీరా తరపు న్యాయవాదులు, ఏదైనా జరగవచ్చని అంటున్నారు. షకీరా 2013 మరియు 2014 మధ్య ఓ షో ద్వారా బాగా ఆర్జించింది. 2014 వరకు ఆమె అంతర్జాతీయ పర్యటనల నుండి ఎక్కువ డబ్బు సంపాదించిందని, 2015లో మాత్రమే పూర్తి సమయం స్పెయిన్‌కు వెళ్లిందని. అన్ని పన్ను బాధ్యతలను నెరవేర్చిందని ఆమె న్యాయవాదులు చెప్పారు. "పండోరా పేపర్స్" లో ఆర్థిక పత్రాల లీక్‌లలో షకీరా పేరు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..!