రూ. 48 లక్షలు ఖర్చు చేసి త‌న‌కు న‌చ్చిన మోడ‌ల్‌లా మారింది

South Korean woman who spent Rs 48 lakh to look like Kim Kardashian. కిమ్ కర్దాషియాన్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఓ ఐకాన్. ఆమె లాంటి ఫిజిక్‌ ను కొందరు చాలా ఇష్టపడుతారు

By Medi Samrat  Published on  12 Aug 2022 12:23 PM GMT
రూ. 48 లక్షలు ఖర్చు చేసి త‌న‌కు న‌చ్చిన మోడ‌ల్‌లా మారింది

కిమ్ కర్దాషియాన్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఓ ఐకాన్. ఆమె లాంటి ఫిజిక్‌ ను కొందరు చాలా ఇష్టపడుతారు. అటు ఫ్యాషన్ సెన్స్ తోనూ.. ఇటు తన పర్సనల్ లైఫ్ తోనూ కిమ్ కర్దాషియాన్ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమెలా ఓ అమ్మాయి మారాలనుకుంది. అందుకు సంబంధించిన సర్జరీలన్నీ చేయించుకుంది ఈ కొరియన్ భామ. కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు అనేక కాస్మెటిక్ సర్జరీల కోసం రూ. 48 లక్షలు (60 వేల డాలర్లు) ఖర్చు చేసినట్లు దక్షిణ కొరియా మహిళ వెల్లడించింది.

28 ఏళ్ల వయసున్న చెర్రీ లీ.. తాను కర్దాషియాన్‌ని చూస్తూ పెరిగానని.. ఆమెలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. కిమ్ కర్దాషియాన్ నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ అని ఆమె చెప్పుకొచ్చింది. లీ తనను తాను మార్చుకోవడానికి 15 శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆమెకు 20 సంవత్సరాల వయస్సులో మొదటి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుండి ఆమె ఎన్నో సర్జరీలు.. చివరికి బ్రెజిలియన్ బట్ లిఫ్ట్‌లతో సహా చాలా సర్జరీలు చేయించుకుంది. "నిజానికి నేను ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా కనిపిస్తున్నాను" అని ఆమె చెప్పింది. నా కొరియన్ కుటుంబంలోని వాళ్లే కొందరు నన్ను గుర్తు పట్టలేకపోయారని ఆమె చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సలు చేయించుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని.. ఇకపై చేయించుకోవాల్సిన అవసరం లేకపోవడమే తనకు ఉన్న బాధ అని ఆమె వాపోయింది. లీని 2010లో ప్రియుడు విడిచిపెట్టాడు. దీంతో ఆమె తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పూర్తిగా రూపాంతరం చెందిన తర్వాత, ఆమె మాజీ ప్రియుడు తిరిగి ఆమెను సంప్రదించగా.. అందుకు ఆమె నో చెప్పేసింది.

లీ ప్రస్తుతం ఒంటరిగా ఉంది. దక్షిణ కొరియాలో నివసిస్తోంది. "నా ముఖ లక్షణాలు కిమ్ కర్దాషియాన్ లాగా ఉన్నాయని నేను అనుకోను, కానీ మొత్తం శరీరం ఆమెలా ఉంటుందని చెప్పింది. తాను అనుకుంటే కిమ్ కర్దాషియాన్ బాడీ డబుల్‌గా ఉండవచ్చని ప్రజలు తరచూ చెబుతుంటారని చెప్పింది. "నేను ఇంతకు ముందు ఎలా ఉండేదాన్నో నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆమె చెప్పుకొచ్చింది.


Next Story