ఆన్‌లైన్‌ జూమ్ మీటింగ్ : ఆ సంగ‌తి మ‌రిచి.. బట్టలు విప్పి స్నానం చేశాడు..!

Someones Hot water Russian Politician Strips gets Shower Zoom. ఒక రష్యన్ రాజకీయ నాయకుడు తన అధికారులతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు.

By Medi Samrat  Published on  11 Dec 2021 8:00 PM IST
ఆన్‌లైన్‌ జూమ్ మీటింగ్ : ఆ సంగ‌తి మ‌రిచి.. బట్టలు విప్పి స్నానం చేశాడు..!

ఒక రష్యన్ రాజకీయ నాయకుడు తన అధికారులతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు. అయితే తన కెమెరాను ఆఫ్ చేశానని అనుకున్నాడో ఏమో కానీ.. ఏకంగా కెమెరా ముందే బట్టలు విప్పి స్నానం చేశాడు. యబ్లోకో పార్టీ సభ్యుడు మాగ్జిమ్ పెట్లిన్, 48, యెకాటెరిన్‌బర్గ్‌లోని తన ఇంటిలో కెమెరా ముందు తన డెస్క్ నుండి లేచి, బట్టలు విప్పి, నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. ఇతర జూమ్ మీటింగ్ పార్టిసిపెంట్‌లు యబ్లోకో స్వెర్డ్‌లోవ్స్క్ బ్రాంచ్ ఛైర్మన్‌గా ఉన్న పెట్లిన్‌పై దృష్టి పెట్టకుండా ప్రయత్నించడం కనిపించింది. ఏమీ జరగ లేదన్నట్లుగా వారి సమావేశాన్ని కొనసాగించారు.

అయితే.. ఈ ఫుటేజ్ కొన్ని న్యూస్ అవుట్‌లెట్‌లకు లీక్ చేయబడింది. మీరు నగ్నంగా మీటింగ్ లో కనిపించారని మీడియా సిబ్బంది అడుగగా.. 'నేను నగ్నంగా కనిపించానా?' అంటూ మాగ్జిమ్ పెట్లిన్ చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఆన్‌లైన్‌ మీటింగ్‌ జరిగింది. నేను నగ్నంగా కనిపించినట్లు నాకు గుర్తు లేదు. అని మాగ్జిమ్ పెట్లిన్ అన్నాడు. ఈ ఎపిసోడ్‌పై ఆయన పార్టీ స్పందించలేదు. ఎనిమిదేళ్ల క్రితం బలవంతపు వసూళ్లకు పాల్పడినందుకు మాగ్జిమ్ పెట్లిన్ కు మూడేళ్ల జైలుశిక్ష విధించినప్పుడు అతని పార్టీ అండగా నిలిచింది. అతనిపై కేసును అధికారులు కావాలనే 'కల్పించారని'.. పెట్లిన్ 'రాజకీయ ఖైదీ' అని పార్టీ పేర్కొంది.


Next Story