Snowdrop actor Kim Mi Soo dies at 31. స్నోడ్రాప్ సిరీస్‌లో సహాయ పాత్ర పోషించిన దక్షిణ కొరియా నటి కిమ్ మి సూ అకస్మిక
By Medi Samrat Published on 5 Jan 2022 1:26 PM GMT
స్నోడ్రాప్ సిరీస్‌లో సహాయ పాత్ర పోషించిన దక్షిణ కొరియా నటి కిమ్ మి సూ అకస్మిక మరణవార్త సినీ అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు 31 సంవత్సరాలు. ఆమె మరణానికి గల కారణాలు వెల్లడి కాలేదు. ఆమె అంత్యక్రియలు Taeneung Sungsim ఫ్యూనరల్ హోమ్‌లో జరుగనున్నాయి. కిమ్ మి సూ మరణంపై వార్తలు వెలువడిన కొద్దిసేపటికే.. ఆమె ఏజెన్సీ ల్యాండ్‌స్కేప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వార్తలను ధృవీకరించింది. అలాగే.. ఆమె మరణంపై పుకార్లు, ఊహాజనిత నివేదికలను వ్యాప్తి చేయడం మానుకోవాలని అభిమానులను, మీడియాను అభ్యర్థించింది. నటి కిమ్ మి సూ కుటుంబం ప్రస్తుతం షాక్‌లో ఉందని, ఆమె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉందని ఓ ప్రకటన పేర్కొంది.
"మేము బాధాకరమైన, హృదయ విదారక వార్తను తెలుపుతున్నాం. జనవరి 5న కిమ్ మి సూ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆకస్మిక వార్తతో ఆమె కుటుంబ పరిస్థితి ప్రస్తుతం చాలా హృదయ విదారకంగా ఉందని.. "విషాదంలో, దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు మరణించిన వారిని భక్తిపూర్వకంగా స్మరించుకునేలా పుకార్లు లేదా ఊహాజనిత నివేదికలను రూపొందించడం మానుకోవాలని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాము. ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. దయచేసి కిమ్ మి సూ శాంతితో విశ్రమించాలని కోరుకుంటున్నాం. కిమ్ మి సూ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ప్రకటనలో తెలిపింది.