అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా షూస్ వేలం‌.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..

Sneakers made for Barack Obama go on sale. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రెండు సార్లు అగ్రరాజ్యాన్ని ఏలిన తొలి

By Medi Samrat  Published on  12 Feb 2021 8:51 PM IST
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా షూస్ వేలం‌.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రెండు సార్లు అగ్రరాజ్యాన్ని ఏలిన తొలి నల్లజాతీయుడు. ఆ దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడమే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లోనూ తన ప్రాబలన్యాన్ని చాటుకున్న అగ్రరాజ్య నాయకుడు ఒబామా. అధికారం నుంచి దిగిపోయి ఒక టర్మ్‌ ముగిసిపోయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు.

ఆయనకు మాత్రమే కాదు.. ఆయన వాడిన వస్తువులకు, ధరించిన దుస్తులకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వాడిన షూస్‌ని వేలం వేశారు. ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ.. ఒబామా షూస్‌ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.25వేల డాలర్లు (భారత కరెన్సీ రూ. 18,21,575)గా నిర్ణయించింది. తెలుపు రంగులో ఉన్న ఈ బూట్లకంటే ఒబామాకు చాలా ఇష్టమట. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉంది.

అయితే తాజాగా వేలానికి పెట్టిన షూలకు చాలా ప్రత్యేకతలున్నాయి. 2009 జనవరి 20 నుంచి 2017 జనవరి 20 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒబామాకు రాజకీయాలతో పాటు క్రీడల పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బాస్కెట్‌ బాల్‌ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో నైకీ సంస్థ ఆయన కోసం ప్రత్యేకంగా షూస్‌ని తయారు చేసి ఇచ్చింది.

ప్లె వేర్‌ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ షూస్‌ని 2009లో ఒబామాకు నైకీ సంస్థ అందజేసింది. ఈ షూస్‌ అంటే ఒబామాకు ఎంతో ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన బయటకు వెళ్తే ఎక్కువగా ఈ షూస్‌నే వాడేవారట. అందుకే ఈ షూస్‌కి అంత క్రేజ్‌ ఉంది. ఈ షూస్‌ను ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.




Next Story