ఫిబ్రవరి 2న మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో విషాద ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని కిన్‌షాసా దక్షిణ శివార్లలోని మార్కెట్‌లో నీటితో నిండిన కాలువలో హై-వోల్టేజీ కేబుల్ పడిపోవడంతో 26 మంది దుర్మరణం చెందారు. ముంచెత్తిన భారీ వర్షం కారణంగా డ్రెయినేజీ పొంగి పొర్లుతోంది. అదే సమయంలో కరెంట్ వైర్లు తెగి డ్రైనేజీలో పడటంతో భారీ ప్రమాదం జరిగింది. పిడుగు పాటుకు ఫేజ్ కండకర్ వైర్ తెగిపోయింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రభుత్వ ప్రతినిధి, పాట్రిక్ ముయాయా మాట్లాడుతూ.. మృతుల్లో 24 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మార్కెట్ వ్యాపారులు, బస్సుల కోసం వేచి ఉన్నవారే. "కేబుల్ తెగిపోయింది. ఉదయం వర్షం తర్వాత నీటితో నిండిన గుంటలో పడిపోయింది." అని ముయయా చెప్పాడు. అతను, ప్రధాన మంత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వం సంక్షోభ సమావేశాన్ని నిర్వహిస్తుందని, మృతుల అంత్యక్రియలకు, గాయపడిన వారి సంరక్షణకు ప్రభుత్వమే భరిస్తుందని ముయ్యయ్య ట్వీట్ చేశారు. ప్రతికూలమైన వాతావరణం కారణంగా.. పిడుగు పడటంతో ఫేజ్ కండక్టర్ తెగిపోవడంతో మతాడి-కిబాలా మార్కెట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఈ ఉదయం విద్యుదాఘాతంతో మహిళలు, పురుషులు ప్రాణాలు కోల్పోయారు అని ప్రధాని సామ లుకొండే ట్విట్టర్‌లో తెలిపారు. "నేను ఆ కుటుంబాల యొక్క అపారమైన బాధను పంచుకుంటున్నాను. నా ఆలోచనలు గాయపడిన వారందరితో కూడా ఉన్నాయి" అని లుకొండే అన్నారు. బుధవారం ఉదయం భారీ తుపాను సమయంలో పిడుగుపాటు సంభవించిందని జాతీయ విద్యుత్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది.