60 సెకెన్లలో కరోనా టెస్ట్ రిజల్ట్..

Singapore provisionally approves one-minute Covid breathalyser test. కరోనా ఫస్ట్ వేవ్ లో కొన్ని లక్షణాల ద్వారా కరోనా ఉందా లేదా అనే విషయం

By Medi Samrat
Published on : 25 May 2021 7:22 PM IST

60 సెకెన్లలో కరోనా టెస్ట్ రిజల్ట్..

కరోనా ఫస్ట్ వేవ్ లో కొన్ని లక్షణాల ద్వారా కరోనా ఉందా లేదా అనే విషయం కాస్తయినా తెలిసేది. కానీ సెకండ్ వేవ్ కి వచ్చేసరికి అసలు లక్షణాలే లేకపోవడంతో అనుమానం రావడానికే ఆలస్యం అయిపోతోంది. కరోనా పాజిటివా, నెగెటివా అనేది ఎంత త్వరగా తేలితే వ్యాధికి చికిత్స అంత త్వరగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న కరోనా టెస్టులకు కాస్త సమయం పడుతుంది. కిట్ల కొరత ఏ దేశానికి అయినా తప్పటం లేదు. ఈ నేపధ్యంలో అత్యంత వేగంగా కేవలం నిమిషం వ్యవధిలో కరోనా పాజిటివా లేదా నెగెటివా అనేది తేల్చే కొత్త విధానం అందుబాటులో వస్తోంది. అదే బ్రీథలైజర్ పరీక్ష.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మన దేశంతో పాటు పక్కనున్న సింగపూర్‌లో కూడా కరోనా కేసులు విపరీతం అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం ఓ కొత్త టెక్నాలజీకి ఓకే చెప్పింది. కేవలం 60 సెకండ్లు అంటే ఒక నిమిషం పాటు ఆ మెషిన్ ముందుండి ఊపిరి పీల్చితే ఆ వ్యక్తికి కరోనా సోకింది.. లేనిది తేల్చేస్తుంది.

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ముగ్గురు గ్రాడ్యుయేట్లు ఈ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ యంత్రం 90 శాతం కచ్చితమైన ఫలితాలను రాబట్టింది. దీంతో ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సింగపూర్ ప్రభుత్వం తాత్కాలిక అనుమతులిచ్చింది.



Next Story