ఇండియన్ అమెరికన్ 'శ్రీ సైనీ' మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచింది. ఈ కిరీటం దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచింది. వాషింగ్టన్ స్టేట్‌కు చెందిన ఆమెకు ఈ సందర్భంగా డయానా హేడెన్ కిరీటం పెట్టారు. 12 ఏళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో ముఖమంతా కాలిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మిస్ వరల్డ్ అమెరికాగా నిలిచే స్థాయికి చేరింది. వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సైనీ జీవితం గులాబీల మంచం కాదు. లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సైనీకి డయానా హేడెన్ కిరీటాన్ని పెట్టింది.
శ్రీ సైనీ గెలిచిన తర్వాత "నేను సంతోషంగా మరియు చాలా భయపడ్డాను. నా భావాలను (మాటలలో) చెప్పలేను. క్రెడిట్ అంతా నా తల్లితండ్రులకు, ప్రత్యేకించి నేను ఇక్కడ ఉన్నందుకు నా తల్లికి కృతజ్ఞతలు. థ్యాంక్యూ మిస్ వరల్డ్ అమెరికా " అని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్, తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఆమె తెలిపింది. 'MWA National Beauty with a Purpose Ambassador' అనే స్థానంలో కూడా శ్రీసైనీ ఉంది.