విషాదం : ర్యాపర్ ను కాల్చి చంపారు

Shocking Rapper Slim 400 Shot and Killed In LA. స్లిమ్ 400గా పాపులర్ అయిన ర్యాపర్ విన్సెంట్ కోక్రాన్ ను లాస్ ఏంజిల్స్‌లో హత్య చేశారు

By Medi Samrat  Published on  11 Dec 2021 10:53 AM GMT
విషాదం : ర్యాపర్ ను కాల్చి చంపారు

స్లిమ్ 400గా పాపులర్ అయిన ర్యాపర్ విన్సెంట్ కోక్రాన్ ను లాస్ ఏంజిల్స్‌లో హత్య చేశారు. అతడిని కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం 7:50 గంటలకు 7వ అవెన్యూలోని 8600 బ్లాక్‌లో జరిగినట్లు నివేదించబడింది. తుపాకీ కాల్పుల శబ్దాలు విన్న తర్వాత పాట్రోలింగ్ అధికారులు అక్కడికి రాగా.. అప్పటికే విన్సెంట్ కోక్రాన్ నేలపై పడి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని వెంటనే అతన్ని L.A హార్బర్-UCLA మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డిటెక్టివ్‌లు రాపర్ కుటుంబ సభ్యులను అడిగి పలు విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే సాక్ష్యాలను సేకరిస్తున్నారు. గతంలో కూడా స్లిమ్ 400పై కాల్పులు జరిగాయి. అయితే వైద్యులు అతడిని కాపాడారు. అతనికి పలు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు. . కాల్పులు జరగడానికి కొన్ని గంటల ముందు స్లిమ్ 400 తన కొత్త మ్యూజిక్ వీడియో "కేవియర్ గోల్డ్"ని Instagramలో ప్రమోట్ చేశాడు. అతడి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

జర్నలిస్ట్ జెఫ్ ప్యాషన్ వీస్ తన ట్విట్టర్ ఖాతాలో స్లిమ్ 400కు నివాళి అర్పించాడు. "RIP Slim 400. A Compton gangsta rap prototype, an ambassador for a tradition, lineage, and history -- who made a whole lot of hard-as-hell rap songs full of sober gravity and blunt force," అంటూ ట్వీట్ చేశాడు.


Next Story