Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు

కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాద‌మైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్‌లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని పొట్టన పెట్టుకుంది.

By Medi Samrat
Published on : 27 April 2025 12:08 PM IST

Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు

కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాద‌మైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్‌లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో అనేక‌ మంది చనిపోయారు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కెనడా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. వాంకోవర్‌లో వీధి పండుగ జరుపుకున్నారు. అప్పుడు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాంకోవర్‌లోని E. 41వ అవెన్యూ, ఫేగర్‌లో వీధి పండుగను జరుపుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అతివేగంగా వస్తున్న కారు జనాల్లోకి ప్రవేశించి పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తొక్కిసలాట జరగడంతో పాటు కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. పోలీసులు కారు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై వాంకోవర్ మేయర్ కిమ్ సిమ్ కూడా స్పందించారు. కిమ్ మాట్లాడుతూ.. "ఈ ప్రమాదంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది భయానక సంఘటన. లాపు లాపు దినోత్సవం సందర్భంగా అతివేగంగా కారు చాలా మంది ప్రాణాలను తీసింది" అని అన్నారు.

కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజలు మరణించిన దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. వీధి అంతా నిశ్శబ్దం. ప్రజల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఎంత మంది మృతి చెందారనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Next Story