సంచలన విషయాన్ని బయట పెట్టిన సౌదీ

Saudi Arabia discovers huge gold, copper deposits in Medina. ఆర్థికంగా ఇప్పటికే ఎంతో ఎత్తు ఎదిగిన సౌదీ అరేబియా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది.

By Medi Samrat  Published on  23 Sep 2022 3:45 PM GMT
సంచలన విషయాన్ని బయట పెట్టిన సౌదీ

ఆర్థికంగా ఇప్పటికే ఎంతో ఎత్తు ఎదిగిన సౌదీ అరేబియా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల దిశగా మరిన్ని అవకాశాలు మరిన్ని పెరుగుతాయని.. సౌదీ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ నూతన నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని, 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా పేర్కొంది. సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు.

అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. కొత్త ఆవిష్కరణలు మైనింగ్ కోసం ఒక పురోగతిని ఏర్పరుస్తాయి.. ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాల కోసం మరిన్ని అవకాశాలను తెరుస్తాయని విశ్లేషకులు చెప్పారు.


Next Story