ఆ అఫైర్ కారణంగానే షోయబ్ కు సానియా విడాకులు ఇవ్వబోతోందా..?

Sania Mirza-Shoaib Malik divorce. సానియా, షోయబ్ విడాలు తీసుకోవటం ఖాయమన్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

By Medi Samrat  Published on  12 Nov 2022 3:48 PM GMT
ఆ అఫైర్ కారణంగానే షోయబ్ కు సానియా విడాకులు ఇవ్వబోతోందా..?

సానియా, షోయబ్ విడాలు తీసుకోవటం ఖాయమన్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. పాక్ కు చెందిన ప్రముఖ మోడల్, యూట్యూబర్ అయోషా ఓమర్ తో షోయబ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, అదే విడాకుల ప్రస్తావన వరకు దారి తీసిందని పాక్ మీడియా తెలిపింది. మోడల్ తో కొన్ని నెలల క్రితం షోయబ్ ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెతో తిరుగుతున్న షోయబ్ తన భార్య సానియాను దూరంపెట్టినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విడాకుల అంశంపై ఇప్పటి వరకు సానియా నుంచి కానీ, షోయబ్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు.

సానియా మీర్జా ఇటీవల 'కష్టకాలం' అంటూ ఓ పోస్ట్ పెట్టడంతో ఇదంతా ప్రారంభమైంది. వారు విడిపోయారని పుకార్లు వచ్చాయి. మీడియాలో వస్తున్న కథనాలపై వారు స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సానియా-షోయబ్ లకు ఇజాన్‌ అనే ఒక కుమారుడు ఉన్నాడు. కరోనా మహమ్మారి సమయంలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ రెండు వేర్వేరు దేశాల్లో నివసించారు. టెన్నిస్ స్టార్ తన కొడుకుతో కలిసి భారతదేశంలో ఉండగా షోయబ్ మాలిక్ తన తల్లితో ఉన్నాడు.


Next Story