లిబియాలో ఇసుక తుఫాను

Sandstorm in Libya. ఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపాన్లు వణికిస్తున్నాయి. లిబియా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.‌

By Medi Samrat
Published on : 25 March 2021 12:12 PM IST

Sandstorm in Libya

ఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపాన్లు వణికిస్తున్నాయి. ఆ దేశంలోని దక్షిణ‌, ఈశాన్య, మ‌ధ్య‌ ప్రాంతాల్లో తుఫాన్ల‌ ప్రభావం తీవ్రంగా ఉన్న‌ది. నైరుతి వైపు నుంచి వీస్తున్న పెను గాలుల ప్ర‌భావంతో భారీగా ఇసుక లేచిప‌డుతోంది. దాంతో లిబియా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బలమైన గాలులు వీస్తుండటంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్తు స్తంభాలు పడిపోయి విద్యుత్తు వ్యవస్థ స్తంభించిపోయింది. దుకాణాలు మూసివేశారు. ప్రజలు ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇసుక తుపాన్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాను కారణంగా ఎగురుతున్న ఇసుకతో డ్రైవర్ర్ లకు రోడ్డు కనపడకుండా పోయింది. దీంతో రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రెండు రోజులుగా ఇసుక తుపాను ప్రభావం పెరగ్గా.. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

బలమైన గాలుల ధాటికి ప‌లు ప్రాంతాల్లో ఇండ్ల పైక‌ప్పులు కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిప‌డ్డాయి. క‌రెంటు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవ‌డంతో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు చీక‌ట్లో మ‌గ్గుతున్నారు. మార్చి 22న గాల్లోకి ఎగిసిప‌డిన దుమ్ము కార‌ణంగా ఆకాశం మొత్తం ప‌సుపు రంగులోకి మారిపోయింది. ఇసుక తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాస్కులు పెట్టుకున్నా దుమ్ము ఆగలేదు. కళ్లలో ఇసుక పడుతుంటే నానా తిప్పలు తప్పలేదు. పగలే రాత్రి లా కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.


Next Story