రష్యా నుండి ఏ ప్రకటన వస్తుందోననే టెన్షన్..
Russia’s Victory Day and its significance in 2022. రష్యాలో ప్రతి ఏడాది మే 9 న ‘విక్టరీ డే’ జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ
By Medi Samrat Published on 9 May 2022 6:06 AMరష్యాలో ప్రతి ఏడాది మే 9 న 'విక్టరీ డే' జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. నాజీయిజం మళ్లీ పురుడుపోసుకోకుండా అడ్డుకుందామని అజర్‌బైజాన్, ఆర్మేనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్ తదితర కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాల ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు. మన సైనికులు.. వారి పూర్వీకులు 1945 లో విజయం సాధించినట్లుగానే ఇప్పుడు కూడా విజయం మనదేనని అన్నారు.
అప్పట్లో ఎంతో విశ్వాసంతో నాజీల నుండి తమ మాతృభూమిని విముక్తి చేయడానికి మన పూర్వీకులు పోరాడారని గుర్తు చేశారు. వివిధ దేశాల ప్రజలను ఇన్ని కష్టాలకు గురిచేసిన నాజీయిజం మళ్లీ పుట్టకుండా నిరోధించడం మన కర్తవ్యమని పుతిన్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ తూర్పున ఉన్న రష్యన్ మాట్లాడే మైనారిటీకి ముప్పు అని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన వారి సైద్ధాంతిక వారసులను నిలువరించడం మన ప్రధాన కర్తవ్యమని పుతిన్ అన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ స్కూలుపై రష్యా బాంబు దాడులు జరిపింది. ఇందులో 60 మంది వరకూ మరణించారు. ఈ స్కూలు బేస్‌మెంట్‌లో 90 మంది వరకూ ఉన్నారు. బిలోహోరివ్కాలోని స్కూలు బాంబు దాడులకు గురైంది. ఇది లుహాన్స్కా ప్రావిన్స్ పరిధిలోనిది. బాంబు దాడుల్నించి స్కూలులో ఉన్న 30 మందిని రక్షించారు. బేస్‌మెంట్‌లో ఉన్న దాదాపు 60 మంది మరణించినట్టు తెలుస్తోంది.