భారత్‌కు పుతిన్.. డేట్స్ ఇవే..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

By -  Medi Samrat
Published on : 28 Nov 2025 9:20 PM IST

భారత్‌కు పుతిన్.. డేట్స్ ఇవే..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్‌కు వస్తున్నారని, ఈ పర్యటన తేదీలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సదస్సు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు.

పుతిన్ చివరిసారిగా 2021లో న్యూఢిల్లీని సందర్శించగా, నరేంద్ర మోదీ గత ఏడాది జూలైలో వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మాస్కోకు వెళ్లారు.

Next Story