ఒక వైపు కరోనా మహమ్మారి, స్ట్రెయిన్ వైరస్‌ల వల్ల జనాలు అతలాతకులం అవుతుంటే తాజాగా బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తున్నట్లు రష్యా వైద్యులు గుర్తించారు. మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రష్యాలో గుర్తించిన ఈ బర్డ్ ఫ్లూ మొదటి కేసుగా గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలు ప్రపంచ ఆరోగ్య శాఖ (డబ్ల్యూహెచ్‌వో)కు నివేదించింది. పక్షుల ద్వారా వ్యాపించే ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్‌లో ఉండే కార్మికులకు అధికంగా సోకే ప్రమాదం ఉందని రష్యా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒకరి నుంచి మరొకరికి సోకదని తెలుస్తోంది. దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించి భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. కోళ్లు, ఇతర పక్షులకు ఈ వ్యాధి సోకడంతో చికెన్ తినడమే మానేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీతో పాటు పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల్లో జంతువులు మృత్యువాత పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.బర్డ్ ప్లూ పై మరింత జాగ్రత్తగా ఉండాలని పలు సూచినలు చేసింది కేంద్రం.