భారత పర్యటనకు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.

By Medi Samrat
Published on : 7 Aug 2025 7:30 PM IST

భారత పర్యటనకు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన వేళ ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పుతిన్ పర్యటన ఖరారైనట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత్ కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా- భారత్ మైత్రిని ఓ వైపు ట్రంప్ తప్పుబడుతూ ఉన్నారు. మరో వైపు భారత్- రష్యా మైత్రి మరింత బలపడుతూ ఉంది

Next Story