కెనడాలో ని ఒక స్కూల్ ఆవరణలో 215 మంది పిల్లల అవశేషాలు శుక్రవారం బయట పడ్డాయి. 1978లో మూసివేయబడిన పాఠశాలలో జరిపిన తవ్వకాలలో ఈ పిల్లల ఆస్తిపంజరాలను కనుగొన్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్‌ స్పెషలిస్ట్‌ ఈ అవశేషాలు కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన దేశ చరిత్రలో ఒక హృదయ విదారక మని కెనడా దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు.

కెనడా లోని బ్రిటిష్‌ కమ్లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల.. 19వ శతాబ్దం చివరలో ఏర్పాటు చేసిన 139 బోర్డింగ్ స్కూల్ లలో అతిపెద్దది. కానీ ఈ స్కూల్ పై ఉన్న ఆరోపణలు అన్నీ, ఇన్నీ కాదు. ఇక్కడి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థినులను విపరీతమైన శారీరక మరియు లైంగిక హింసకు గురి చేశారన్నది నమ్మక తప్పని ఘోరమైన నిజం. రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యాసంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు 4,100 మంది పిల్లలు మరణించినట్లు తేలింది. వివిధ పరిశోధనల అనంతరం వీరి వివరాలయితే లెక్క తెలియలె గానీ వాటిలో ఎక్కడా ఈ 215 మంది పిల్లల వివరాలు చేర్చి ఉండలేదని సమాచారం.

అప్పట్లో పాఠశాలలకు హాజరైన 150,000 మంది పిల్లలలో చాలా మంది భయంకరైన శారీరక వేధింపులు, అత్యాచారాలు ఇతర ఘోరమైన సమస్యల బారిన పడ్డారని ఈ నేపథ్యంలోనే పాఠశాలను మూసి వేసినట్టుగా తెలుస్తోంది. అయితే 2008లో కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు అధికారంగా క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ బ్రిటీష్‌ కొలంబియా కార్యాలయంతో కలిసి దర్యాప్తు కొనసాగుతుందని, లభ్యమైన అవశేషాలు భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. పిల్లల జ్ఞాపకార్థం శుక్రవారం అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేశారు. 215 మంది పిల్లల షూ లు, బ్యాగ్ లు వంటి వస్తువులు వాటి పక్కన క్యాండిల్స్ పెట్టి నివాళులర్పించారు.
జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story