11 రోజులు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

Qatar declares 11-day holiday. ఖతార్ ప్రభుత్వం ఈద్ అల్-ఫితర్‌ను పురస్కరించుకుని 11 రోజుల పాటూ సెలవులను ప్రకటించింది.

By Medi Samrat  Published on  17 April 2023 6:15 PM IST
11 రోజులు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

Qatar declares 11-day holiday


ఖతార్ ప్రభుత్వం ఈద్ అల్-ఫితర్‌ను పురస్కరించుకుని 11 రోజుల పాటూ సెలవులను ప్రకటించింది. ఖతార్‌లో రంజాన్ సెలవులు ఏప్రిల్ 19న ప్రారంభం అవ్వనున్నాయి. ఉద్యోగులు ఏప్రిల్ 30, 2023 ఆదివారం నాడు తిరిగి విధుల్లోకి రావాల్సి ఉంది. ఈ సెలవుదినాలు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు వర్తిస్థాయి. ఖతార్ లోని బ్యాంకులకు కూడా సెలవులకు సంబంధించి ఆదేశాలను జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ రోజునే కాకుండా మరో రెండు రోజులు సెలువులు ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం షబ్-ఎ-ఖదర్, జుమాత్-ఉల్-విదా రోజున అంటే ఏప్రిల్ 19 (బుధవారం), ఏప్రిల్ 21 (శుక్రవారం)కి ఆప్షనల్ హాలిడేస్ కింద రీషెడ్యూల్ చేసింది. షబ్ ఎ ఖదర్ రోజునే ఖురాన్ ఈ భూమిమీదకు వచ్చిందని నమ్ముతారు. అందుకే ఆరోజు రాత్రంతా జాగారం చేస్తూ.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఖురాన్ పఠనం కూడా చేస్తారు.


Next Story