ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు ప్రధాని మోదీ సూచించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో.. పుతిన్ అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తన సంభాషణ గురించి సమాచారం ఇచ్చారు.
పుతిన్‌తో తన సంభాషణ తర్వాత.. PM మోడీ తన ఎక్స్-పోస్ట్‌లో ఇలా వ్రాశారు.. "నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసినందుకు.. అలాస్కాలో అధ్యక్షుడు ట్రంప్‌తో మీ ఇటీవలి సమావేశం గురించి సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ ఎప్పుడూ పిలుపునిచ్చింది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు."
ఆగస్టు 15 న ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక అంశాలపై అధ్యక్షుడు పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య అలస్కాలో చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో యుద్ధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. సోమవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరగనున్నాయి.