చైనాలో పిల్లలు అలా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు..!

Punishment for parents if children behave badly in china. చైనా పార్లమెంట్‌ కొత్త విద్యా చట్టానికి ఆమోదం తెలిపింది. విద్యార్థులపై హోమ్‌ వర్క్‌ ఒత్తిడి లేకుండా ఉండే రీతిలో రూపొందించి

By అంజి  Published on  23 Oct 2021 11:53 AM IST
చైనాలో పిల్లలు అలా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు..!

చైనా పార్లమెంట్‌ కొత్త విద్యా చట్టానికి ఆమోదం తెలిపింది. విద్యార్థులపై హోమ్‌ వర్క్‌ ఒత్తిడి లేకుండా ఉండే రీతిలో రూపొందించిన కొత్త చట్టానికి చైనా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సాయంత్రం స్కూల్‌ అయిపోయాక ప్రైవేట్‌ ట్యూషన్లకు వెళ్లకుండా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. విద్యార్థులను సరైన దారిలో పెట్టేందుకు కొత్త చట్టంలో కఠిన నిర్ణయాలను పొందుపరిచారు. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అడిక్ట్‌ అవుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

అలాగే చెడు ప్రవర్తన, క్రైమ్‌కు పాల్పడే పిల్లల తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాన్ని తయారు చేసే యోచనలో ఉన్నట్లు ఆ దేశ పార్లమెంట్‌ తెలిపింది. స్థానిక ప్రభుత్వాలే పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న చదువులను అదుపులోకి తీసుకురావాలని చైనా పార్లమెంట్‌ సూచించింది. విద్యార్థులకు కావాల్సినంత విశ్రాంతితో పాటు, వ్యాయామం, ఒత్తిడి తగ్గించే మెళకువలు నేర్పాలంది. అలాగే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూడాలంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి వీడియో గేమ్స్‌ ఆడే మైనర్ల కోసం కొత్త ఆదేశాలు జారీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో కేవలం గంట మాత్రమే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story