భారత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను తప్పుబట్టిన యూకే

Problem Isn't Covishield But India's Vaccine Certificate. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే) అంగీక‌రించ‌లేదు.

By Medi Samrat  Published on  22 Sep 2021 2:22 PM GMT
భారత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను తప్పుబట్టిన యూకే

కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే) అంగీక‌రించ‌లేదు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోస్‌ల తీసుకుని తమ దేశానికి వచ్చే ప్రయాణికులను వ్యాక్సిన్ వేసుకోనివారిగానే పరిగణిస్తామని, వీరు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని యూకే ప్రకటించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది వివక్ష తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. పూర్తిగా వివక్ష పూరితమైన విధానం అని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. భారత్ నుండి పంపిన వ్యాక్సిన్లకు అక్కడి ప్రజలకు వినియోగించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడదే కొవిషీల్డ్ ను బ్రిటన్ గుర్తించకపోవడాన్ని వివక్షగానే భావిస్తామని స్పష్టం చేసింది.

తాజాగా ప్ర‌యాణ నిబంధ‌న‌ల‌ను యూకే స‌వ‌రించింది. కొవిషీల్డ్‌ను కూడా ఆమోదించిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చింది. కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భార‌తీయులు కూడా క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేసింది. దీనిపై యూకే స్పందిస్తూ.. స‌మ‌స్య కొవిషీల్డ్ కాద‌ని, ఇండియాలోని వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేష‌న్‌పై అనుమానాలే అస‌లు స‌మ‌స్య అని చెప్పింది. ఇండియా వ్యాక్సిన్ స‌ర్టిఫికేష‌న్‌ను గుర్తించేందుకు భారత్ తో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు యూకే ప్ర‌భుత్వం తెలిపింది. స‌ర్టిఫికెట్‌పై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంపై కూడా భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


Next Story