ట్రంప్ ను రెచ్చగొడుతున్న జెలెన్స్కీ

ఉక్రెయిన్ దేశాధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీ వ్యవహరిస్తున్న తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.

By Medi Samrat  Published on  21 Feb 2025 9:15 PM IST
ట్రంప్ ను రెచ్చగొడుతున్న జెలెన్స్కీ

ఉక్రెయిన్ దేశాధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీ వ్యవహరిస్తున్న తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని నియంత అని పిలిచేశారు.

ఎన్నికలు లేని నియంత, జెలెన్స్కీ దూకుడుగా ముందుకు వెళ్లడం మంచిది కాదని, అతడి దేశానికే ప్రమాదం అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్‌ వాదనను ట్రంప్‌ బహిరంగంగానే తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని, ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. జెలెన్‌స్కీ ఒక నియంత అని.. దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ ఆరోపించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడానికి సౌదీ అరేబియాలో రష్యాతో చర్చల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. జెలెన్‌స్కీ తీరుతో ట్రంప్‌ విసిగిపోతున్నారని యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ అన్నారు. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్‌ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా శాంతిస్థాపన కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ముందుకు రాలేదన్నారు.

Next Story