షాకింగ్.. కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు
దక్షిణ పోలాండ్‌లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు.
By - Medi Samrat |
దక్షిణ పోలాండ్‌లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు. వార్సా నుండి 180 మైళ్ల దూరంలో ఉన్న స్విటోచోవిస్‌లో ఆమె తల్లిదండ్రుల ఫ్లాట్‌లో శబ్దాలు విని పొరుగువారు పోలీసులకు కాల్ చేయడంతో షాకింగ్ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్లుగా తల్లిదండ్రుల చేతిలో బందీగా ఉన్న 42 ఏళ్ల మిరెల్లా కోసం ఇరుగుపొరుగువారు, శ్రేయోభిలాషులు డబ్బు సేకరిస్తున్నారు.
మిరెలా అనే మహిళ జూలైలో రక్షించబడింది. అయితే ఆమె కథ అక్టోబర్‌లో తెరపైకి వచ్చింది. స్థానిక మీడియా ప్రకారం.. మిరెల్లా ఆమె 15 సంవత్సరాల వయస్సు నుండి ఇంట్లోనే లాక్ చేయబడింది. ఆమె తప్పిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు సమాజాన్ని నమ్మించారు.
ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమె చాలా బలహీనమైన స్థితిలో ఉందని, ఆమె శారీరక స్థితి బలహీనంగా ఉందని.. ఆమె "వృద్ధ మహిళ" లాగా ఉందని గుర్తించారు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని పోలీసు అధికారులు పట్టుబట్టారు. ఇన్‌ఫెక్షన్, కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల్లోనే చనిపోవచ్చని వైద్యులు తెలిపారు.
మీరెలా యుక్తవయసులో ఉన్నప్పుడు తెలిసిన ఇరుగుపొరుగు వారు ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలిసి షాక్ అయ్యారు. చాలా కాలంగా బందీగా ఉన్న ఆమె ఆరోగ్యాన్ని నయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.. ఆమె జూలైలో రక్షించబడింది, అయితే ఈ నెలలో పోలాండ్‌లో కేసు బహిరంగమైంది. ఆమె తల్లిదండ్రుల ఫ్లాట్‌లో శబ్దాలు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. అప్పుడు ఇంట్లో మీరెల్లా కనిపించింది.
భవనంలో నివసించే పొరుగు వారు మాట్లాడుతూ.. “ఫ్లాట్ నుండి శబ్దాలు రావడం ప్రారంభమైంది, మేము పోలీసులను పిలిచే సమయానికి అప్పటికే అర్థరాత్రి అయ్యింది. మిరెల్లా తల్లిదండ్రులు ఆమె 15 సంవత్సరాల వయస్సులో కనిపించకుండా పోయిందని చెప్పారని.. అది జరిగింది 27 సంవత్సరాల క్రితం అని పేర్కొన్నారు. అయితే ఆమెను ఎందుకు బందించారనే విషయం తెలియాల్సివుంది.