ఎండాకాలంలో కూడా కోట్ వేసుకున్నాడని వ్యక్తిని విచారించిన ఇంగ్లండ్ పోలీసులు

Police Stop Black Man in England for Wearing Coat During Summer. ఇంగ్లండ్‌లోని సౌత్ లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో 20 ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తిని అక్కడి

By Medi Samrat
Published on : 4 April 2022 1:43 PM IST

ఎండాకాలంలో కూడా కోట్ వేసుకున్నాడని వ్యక్తిని విచారించిన ఇంగ్లండ్ పోలీసులు

ఇంగ్లండ్‌లోని సౌత్ లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో 20 ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తిని అక్కడి వాతావరణానికి సరిపడని దుస్తులు ధరించాడనే కారణంతో పోలీసులు ఆపి అతన్ని మొత్తం వెతికారు. ఎరిక్ బోటెంగ్-టేలర్ అనే వ్యక్తిని కార్టర్ జూనియర్ అని కూడా పిలుస్తారు. అతను షాపు నుండి కొన్ని టాయిలెట్ రోల్స్ కొనుగోలు చేసి తన పనికి వెళ్తుండగా ఇద్దరు పోలీసు అధికారులు అతన్ని పట్టుకున్నారు. అధికారులు ఎరిక్‌ను ఆపి, ఇంత వేడి వాతావరణంలో కోటు ఎందుకు ధరించావని ఆరా తీయడం ప్రారంభించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఎరిక్‌ను ఆపివేసిన ప్రాంతం "మాదకద్రవ్యాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది." డ్రగ్స్ దుర్వినియోగ చట్టం కింద ఎరిక్‌ను ఆపారు. అధికారులు అతనితో కూడా "వాతావరణానికి తగిన దుస్తులు ధరించలేదు" అని చెప్పారు.

ఎరిక్ వెంటనే తన ఫోన్‌ని తీసి.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న అధికారులు తనతో జరిపిన మొత్తం సంభాషణను రికార్డ్ చేశాడు. వీడియోలో, ఎరిక్, "నాకు ఏది కావాలంటే అది ధరిస్తాను" అని చెప్పడం వినబడింది, "మీరు కోటు ఎందుకు ధరించారు" అని అధికారి కాస్త కోపంగా అడిగాడు. "మీరు ఏమి ధరించారు అని నేను అడుగుతున్నాను?" అని అధికారి చెప్పడం వినబడింది. ఎరిక్ వారి ప్రశ్నకు సమాధానమిచ్చినప్పుడు.. మరొక అధికారి మాట్లాడుతూ.. "మీరు వేడి వాతావరణం కోసం దుస్తులు ధరించలేదు. ఈ బట్టలు ధరిస్తే చాలా వేడిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వింతగా అనిపిస్తుంది. " అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "what institutional racism looks like." అంటూ పలువురు అధికారులపై విమర్శలు గుప్పించారు. నలుపు రంగు వ్యక్తి కాబట్టే పోలీసులు ఇలా చేశారని విమర్శలు గుప్పించారు.

Next Story