అమెరికాకు ప్రధాని మోదీ.. ఎన్ని రోజులు పర్యటించబోతున్నారంటే.?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు

By Medi Samrat  Published on  21 Sep 2024 1:45 AM GMT
అమెరికాకు ప్రధాని మోదీ.. ఎన్ని రోజులు పర్యటించబోతున్నారంటే.?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఒక కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. క్వాడ్ సమ్మిట్‌ను అధ్యక్షుడు జో బిడెన్ తన స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహిస్తున్నారు.

'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు తన మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరారు. US ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం, ప్రపంచ ప్రయోజనాల కోసం భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి కొత్త మార్గాలను సమీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story