భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీతో శనివారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రధాని మోదీ, అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉక్రెయిన్ ఘర్షణ పరిష్కారంలో భారత్ నిరంతరంగా అనుసరిస్తున్న శాంతి మార్గాన్ని మరోసారి స్పష్టం చేశారు. త్వరితగతిన శాంతి పునరుద్ధరణ కోసం తీసుకునే చర్యలకు భారత్ పూర్తి స్థాయి మద్దతు అందిస్తుందని పునరుద్ఘాటించారు. అలాగే ఇరువురు నాయకులు, భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై కూడా చర్చ జరిపారు.