బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ కానుకలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మోదీకి వైట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బైడెన్
By అంజి Published on 22 Jun 2023 8:10 AM GMTబైడెన్ దంపతులకు ప్రధాని మోదీ కానుకలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మోదీకి వైట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతుల నుంచి మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ అందింది. ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతలు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. బైడెన్‌తో మోదీ చర్చలు చేసారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించిన అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్ బైడెన్‌లు.. ఆయన కోసం ప్రత్యేక విందు, బహుమానాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విందులో ప్రత్యకంగా మిల్లెట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అధికారిక మెనూలో చిరుధన్యాల వంటకాలను చేర్చారు. ఫస్ట్ కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సల్, అవకాడో సాస్ ఏర్పాటు చేయగా.. మెయిన్ కోర్సులో స్టఫ్డ్ పోర్టబోల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్ డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ డ్రింక్స్ ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధానికి బైడెన్ దంపతులు బహుమానాలు అందించారు. ప్రధాని మెదీ సైతం బిల్ బైడెన్‌కు డైమండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. మోదీకి జో - బిల్ బైడెన్‌లు 20వ శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీని కానుకగా ఇచ్చారు. బైడన్ పర్సనల్‌గా మోదీకి ఓ అమెరికన్ కెమెరాను గిఫ్ట్‌గా అందించారు. దీంతో పాటుగా జార్ట్ ఈస్ట్ మెన్ మొదటి కొడాక్ కెమేరా పెటెంట్ ఆర్వైవల్ ఫాక్సిమైట్ ప్రింట్, అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల మొదటి ఎడిషన్ కాపీని గిఫ్ట్‌గా అందించారు. భారత్‌తో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత.. నోబెల్ విన్నర్ యేట్స్ భారత ఉపనిషత్తుల ఇంగ్లీషు తర్జుమా కాపీని అందచేసారు. యేట్స్ 1923 లో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు. ఆ తర్వాత మోదీ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
వైట్ హౌస్‌లో మోదీకి ఆతిథ్యమిచ్చిన బైడెన్ దంపతులకు కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ. గ్రీన్ డైమండ్, వెండి వినాయక ప్రతిమ బహుమతుల బహూకరణ. మోదీకి పాత కాలపు కెమెరాను గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్. #NarendraModi #JoeBiden #PMNarendraModi మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో @NewsmeterTelugu అవ్వండి pic.twitter.com/nfU52gpL0D
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 22, 2023