యుఎస్‌లోని న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పిరికిపంద ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ట్వీట్‌లో ప్రధాని మోదీ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్ జబ్బార్ గా అమెరికా గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు అమెరికా మిలిటరీలోనూ సేవలు అందించాడు. ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్ ఉగ్రవాద సంస్థ జెండా కూడా లభించింది. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. ఆ వాహనంతోనే బర్బన్ వీధిలో ప్రజల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 15 మంది మరణించారు.